ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు చివరికి చేదు అనుభవమే మిగిలింది అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ కి ముందు బాగా రాణించాలి అనుకున్న ఆస్ట్రేలియా జట్టు ఇక సొంతగడ్డపై టీమిండియాని ఓడించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇక ఎంతో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని భావించింది.  కానీ భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురయింది.


 మొదటి మ్యాచ్ లో ఓడి పోయి నిరాశ పరిచిన టీమిండియా ఆ తర్వాత మాత్రం వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. 2-1 తేడాతో ఆదిక్యాన్ని  కొనసాగించింది టీమిండియా. కాగా టీ20 వరల్డ్ కప్ కి ముందు ఇక చివరికి ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇటీవలే టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోవడం పై స్పందించిన ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా లేకపోవడం తో ఇక టీమిండియా బలహీనం గా మారుతుందని భావించాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 కానీ రవీంద్ర జడేజా స్థానం లో జట్టు లో అవకాశం దక్కించుకున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం మా అంచనాలు మొత్తం తారుమారు చేసేసాడు అంటూ ఆండ్రూ మెక్ డోనాల్డ్ చెప్పుకొచ్చాడు. జడేజా లాంటి కీలక ఆల్ రౌండ్ లేక పోతే టీమిండియా బలహీనం గా కనిపిస్తుంది అనుకున్నప్పటికీ అక్షర్ పటేల్ అద్భుతం గా రానించి మా ప్రణాళికలను మొత్తం చిన్నాభిన్నం  చేశాడు. అతని ప్రదర్శన తో అందరూ షాక్ కి గురయ్యాం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్షర్ పటేల్ మూడు మ్యాచ్లలో 8 టికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర వహించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: