ప్రస్తుతం టీమిండియాలో కీలకమైన ప్లేయర్గా కొనసాగుతున్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా  ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను విజయ తీరాలకు నడిపించడంలో సూపర్ ఫినిషర్ పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా సరిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చూడడానికి బక్కపలుచగా ఉంటాడు.. ఇతను భారీ సిక్సర్లు కొట్టగలడా అని అందరికీ అనుమానం కలుగుతూ ఉంటుంది.


 కానీ అతను కొట్టే వీరబాదుడు చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు అని చెప్పాలి. బౌలర్ ఎలాంటి బంతిని సంధించిన దానిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా హార్థిక్ పాండ్యా బ్యాట్ జులిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోని ఎప్పుడు టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఇక బౌలింగ్ లో కూడా మెరుపులు మెరూపిస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రతిభ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా కు సరితూగే ఆటగాడు పాకిస్తాన్ జట్టులో లేడు అంటూ షాహిద్ ఆఫ్రిథి వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ బౌలింగ్లో కీలకంగా ఉంటూ ఎంతో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా.. టీమ్ ఇండియాకు ఒక నమ్మదగిన ఆల్ రౌండర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అంటూ షాహిద్ ఆఫ్రిది తెలిపాడు. ఇక పాకిస్తాన్ జట్టుకు కూడా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ కావాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఆసిఫ్ అలీ సహా మరి కొంతమంది ఆటగాళ్లు నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. తప్పులను సరిదిద్దుకుంటే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ బాగా రాణిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: