ఇటీవల భారత జట్టు ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించి 2-1 తేడాతో ఘన విజయాన్ని సాధించింది అనే విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ కి ముందు  టీం ఇండియాకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఈ విజయం ఉపయోగపడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక భారత జట్టు టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో గెలవడానికి యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఆడిన సంచలనమైన ఇన్నింగ్స్ కారణం అని చెప్పాలి.


 స్టార్ ఆస్ట్రేలియా బౌలర్లను సైతం ఎంతో అలవోకగా ఎదుర్కొన్న సూర్య కుమార్ యాదవ్ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ దాటికి ఉప్పల్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు అందరూ కూడా అతని బ్యాటింగ్ తీరు చూసి ఉర్రూతలూగిపోయారు   అని చెప్పాలీ  మూడో టి20 మ్యాచ్లో 36 బంతుల్లోనే 69 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్. కాగా అతనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలీ. అతను ఒక అసాధారణ ఆటగాడు అంటూ ఎంతో మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


 సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించడంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సోషల్ మీడియాకు వేదికగా స్పందించాడు. సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి. అతడు అందరినీ అధిగమించి ఆల్ టైం గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ గా ఎదుగుతాడని ఆకాశానికి ఎత్తేసాడు డానీష్ కనేరియా.  అతను ఒక అత్యుత్తమమైన బ్యాట్స్మెన్ భిన్నమైన శైలిలో తన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. 360 డిగ్రీలలో షాట్లు కొట్టగల సమర్ధుడు.. మూడో టి20 లో అద్భుతంగా ఆడాడు. కోహ్లీతో కలిసి పెద్ద భాగస్వామ్యాన్ని నిర్మించాడు అంటూ డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు . అతని బ్యాటింగ్ దిగ్గజాలను సైతం మైమరపింప చేస్తుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: