ఇటీవల ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా ఇక ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా పై కూడా అదే జోరును కొనసాగించింది. ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా తో మూడు టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా ఇటీవల కేరళలోని తిరువనంతపురం వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరిగింది.  కాగా ఎన్నో రోజుల తర్వాత ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం రావడంతో ఇక ప్రేక్షకులందరూ స్టేడియంలో కిక్కిరిసిపోయారు అని చెప్పాలి.


 టీమిండియా గెలవాలి అంటూ తమ పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. అయితే ఈ మొదటి మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా ను బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీయడంతో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత స్వల్ప లక్ష చేదనతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగానికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురయింది. రబాడా దెబ్బకు కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెను తిరిగాడు.


 ఇక మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ సైతం 9బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి చివరికి పెవిలియన్  చేరాడు అని చెప్పాలి. కానీ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 56 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి మెరుపులు మెరిపించి  33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించింది టీమిండియా జట్టు. తద్వారా మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అని చెప్పాలి. ఇక మొదటి విజయంతో 1-0 తేడాతో ఆదిక్యంలోకి వచ్చేసింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: