ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అతి తక్కువ ఓవర్లలోనే ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించి ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. టీమిండియా బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం సమిష్టిగా రాణించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.


 ఇక అటు అభిమానులు కూడా టీమిండియా విజయం పై సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించిన టీమిండియా ఒక చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా స్వల్ప లక్షలు చేదనతో  బరిలోకి దిగింది టీమిండియా. ఇలాంటి సమయంలోనే ఆదిలోనే టీమిండియా కు చేదు అనుభవం తప్పలేదు.


 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రబాడ బౌలింగ్లో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో తర్వాత బ్యాట్స్మెన్లు వికెట్ కాపాడుకుంటూ ఆచీతూచి ఆడారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా స్కోర్ ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు మాత్రమే. ఇక తర్వాత దాటిగా ఆడి విజయం సాధించిన పవర్ ప్లేలో తక్కువ స్కోర్ కారణంగా చెత్త రికార్డు నమోదు చేసింది.  టి20 చరిత్రలోనే తొలిసారిగా అత్యల్ప స్కోర్ నమోదు చేసింది భారత జట్టు. అయితే గతంలో 2016లోపాకిస్తాన్పై జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేయగా ఇదే అత్యల్ప స్కోర్ గా ఉండేది. ఇక ఇప్పుడు ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: