సాధారణం గా ఫుట్బాల్ ఆటకి ప్రపంచ వ్యాప్తం గా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు ఇక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు స్టేడియం మొత్తం ఇక ఫాన్స్ అందరు కూడా కిక్కిరిసి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా అభిమానులు కొంతమంది ఆటకాల్ల పట్ల నిరసన వ్యక్తం చేయాలి అంటే ఫ్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.


 ఏకంగా ఉత్కంఠ భరితంగా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడిని టార్గెట్ గా చేసుకుంటూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అరటి పండ్లు విసరడం బాటిల్ తో కొట్టడానికి ప్రయత్నించడం కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలీ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే దీన్ని జాత్యహంకార  చర్యగా పేర్కొంటూ నెటిజెన్లు  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్యారిస్లో ఇటీవల జరిగిన మ్యాచ్లో ఉత్తర ఆఫ్రికాలోని ట్యూనిషియాను బ్రెజిల్ 5-1 తేడాతో ఓడించింది.


 మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్ రీఛాలీసన్ రెండో గోల్ సాధించగానే ఆ జట్టు ఆటగాళ్లందరూ ఒక దగ్గరికి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ఒక అరటిపండు వచ్చి వారి దగ్గర పడింది. అనంతరం దాని ఓ ఆటగాడు బయటకు తన్నాడు. పొరపాటున అరటిపండు వచ్చి పడింది అని అనుకున్నాడు.  కానీ ఆ తర్వాత మాత్రం గోల్ చేసిన ఆటగాడిని టార్గెట్ చేసుకుంటూ ఎన్నో అరటి పండ్లను విసిరారు. దీనిపై బ్రెజిల్ ఫుట్బాల్ ఫెడరేషన్ అభ్యంతరం తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా తాము పోరాడుతూనే ఉంటాము అంటూ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: