కాలం కలిసి రావాలి కానీ పంచభూతాలు కూడా మన వెన్నంటే ఉంటాయి అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో ఇదే జరుగుతుంది అన్నది తెలుస్తుంది. రోహిత్ శర్మకు స్వర్ణ యుగం నడుస్తుందా అంటే ప్రస్తుతం ప్రతి ఒకరి నోటి నుంచి వినిపించే మాట అవును అనే. ఎందుకంటే అతను బ్యాట్స్మెన్ గా పెద్దగా రాణించకపోయినప్పటికీ కెప్టెన్ గా మాత్రం టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా తన వ్యూహాలతో విజయం అందిస్తూ అదరగొట్టేస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే ఇలా టీమిటియాకు విజయాలు అందిస్తూనే ఎన్నో రికార్డులు కొలగొడుతున్నాడు రోహిత్ శర్మ. గతంలో ఐపీఎల్ లో తన కెప్టెన్సీ తో అందరిని ఆశ్చర్యపరిచిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు టీమిండియా సారథిగా కూడా అదే రీతిలో మ్యాజిక్ కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే భారత కెప్టెన్  రోహిత్ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.. ఇక ధోనిని అధిగమించి భారత్కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ.  టీమిండియా తరఫున ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టి20 మ్యాచ్ లను గెలిపించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.


 ధోనిని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి చేరుకోగా ఇక ఇప్పుడు ధోని రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల తిరువనంతపురం వేదికగా జరిగిన సౌత్ ఆఫ్రికా తో మొదటి టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది టీమ్ ఇండియా. తద్వారా ఈ ఏడాది 16వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో కెప్టెన్గా విజయం సాధించాడు రోహిత్ శర్మ. ఒక సంవత్సరంలో అత్యధిక టి20 మ్యాచ్ లు 15 గెలిచిన రికార్డు ధోని పేరిట ఉండేది. ఇక ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. ఇక సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ కు ముందు అటు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కూడా రెండు మ్యాచ్లో విజయం సాధించి టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: