ఇటీవలే టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనె  ఫెదరర్ రిటైర్మెంట్ ఎంతో భావోద్వేగాపూరితంగా జరిగింది అని చెప్పాలి. తన చిరకాల ప్రత్యర్థి అయిన నాదల్ తో చివరి మ్యాచ్ ఆడిన రోజర్ ఫెదరర్ చివరికి తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఈ క్రమంలోనే రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇక మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కోచింగ్ సిబ్బంది అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక రోజర్ ఫెదరర్ చిరకాల ప్రఖ్యాతిగా పేరుగాంచిన  నాదల్  సైతం ప్రత్యర్థి ఫెదరర్ రిటైర్మెంట్ ని తట్టుకోలేకపోయాడు.


 చివరికి కన్నీటి పర్యంతంలో మునిగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోని ఇటీవలే తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రపంచ మాజీ నెంబర్వన్ జకోవిచ్. రోజర్ ఫెదరర్ లాగానే తనకు కూడా భావోద్వేగా వీడ్కోలు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వీడ్కోలు సమయంలో చిరకాల ప్రత్యర్ధులు తన పక్కన ఉండాలి అంటూ తెలిపాడు. ఎందుకంటే హృదయాన్ని కదిలించే క్షణాలు అవి. ఫెదరర్ రిటైర్మెంట్ సమయంలో అతని పిల్లలు కుటుంబాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి  లోనయ్యాను. తాను టెన్నిస్ కు గుడ్ బై చెప్పినప్పుడు వీడ్కోలు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా.


 తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్న సమయంలో తను చిరకాల ప్రత్యర్ధులు పోటీదారులు అందరు కూడా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. అలా జరిగితేనే తన రిటైర్మెంట్ క్షణాలకు ప్రత్యేకత ప్రాధాన్యత కూడా ఉంటుంది. కాగా టెన్నిస్ చరిత్రలో మరే ప్రత్యర్ధులు పోటీ పడనన్నిసార్లు రఫెల్ నాదల్ నేను తలపడ్డాము. మా మధ్య పోటీ ఎప్పటికి ప్రత్యేకమే. ఒకరితో మరొకరం తలపడేందుకు వీలైనంత ఎక్కువసార్లు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నా. ఇది మాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు, ఆటకు  ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది అంటూ జకోవిచ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: