బీసీసీఐ నుండి కొన్ని గంటల క్రితమే ఒక వార్త వెలువడింది. ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో కీలక ఆటగాడు అయిన జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ వార్త నిజంగా ఇండియా అభిమానులకు మింగుడు పడదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బౌలర్ లలో యార్కర్ ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఒకరు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టీ 20 సీరీస్ లోనూ అంతగా రాణించని బుమ్రా ఫామ్ పై సందేహాలు ఉండేవి..ఈ విషయం గురించి టీమ్ అంతా చర్చిస్తూ ఉండేవారు. కానీ ఇంతలోనే మరో పిడుగులాంటి వార్త అందరినీ ఎంతగానో బాధ పెట్టింది అని చెప్పాలి.

ఆస్ట్రేలియా సీరీస్ లోనూ వెన్ను నొప్పి కారణంగా మొదటి మ్యాచ్ ఆడకుండా.. రెండు మరియు మూడవ  మ్యాచ్ లు మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే. కానీ సౌత్ ఆఫ్రికా సీరీస్ లో అయినా పూర్తి మ్యాచ్ లను ఆడుతాడు అని ఊహించిన అభిమానులకు నిన్న షాక్ తగిలింది. మొదటి మ్యాచ్ ముందు ప్రాక్టీస్ లో అతను ఆడడం కష్టం అని టీమ్ యాజమాన్యం చెప్పింది. అయితే నిన్న మరోసారి బుమ్రాకు స్కాన్ చేయించగా... గాయం ఇప్పుడు అప్పుడే తగ్గదని దాదాపు ఆరు నెలల పాటుగా ఈ గాయం ప్రభావం ఉంటుంది రిపోర్ట్స్ తెలిపాయి. దీనితో బీసీసీసి అధికారికంగా బుమ్రా టీ 20 వరల్డ్ కప్ ఆడడం లేదని స్పష్టం చేసింది. ఇది నిజంగా తీరని లోటు అని చెప్పాలి.

ఇక వరల్డ్ కప్ కు కేవలం పది రోజులే సమయం ఉండగా ఊహించని ఈ లోటు భారత్ వరల్డ్ కప్ విన్నింగ్ అవకాశాలను దెబ్బ తీస్తుందా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి బుమ్రా లాంటి బౌలర్ ను భర్తీ చేసే ప్లేయర్ ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న గురించి ఇప్పుడు టీమ్ సభ్యులు, టీమ్ యాజమాన్యం మరియు ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: