విరాట్ కోహ్లీ తన సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటికే ఐపీఎల్లో తన కెప్టెన్సీ సామర్థ్యం ఏంటో నిరూపించుకున్నాడు.  అయితే ఇక ఇప్పుడు జట్టును కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది.


 అయితే రోహిత్ శర్మ కెప్టెన్గా జట్టుకు విజయాలను అందించడంలో సక్సెస్ అవుతున్నప్పటికీ ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం రాణించలేకపోతున్నాడు అని చెప్పాలి. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ జట్టుకు మంచి ఆరంభాలను అందించి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన రోహిత్ శర్మ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్నాడు. ఇక రోహిత్ శర్మ లాంటి కీలక ఆటగాడు వికెట్ కోల్పోవడంతో జట్టు మొదట్లోనే కష్టాల్లో పడిపోతుంది. ఇకపోతే ఇటీవలే  సౌత్ ఆఫ్రికా తో తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ మరోసారి తన బ్యాటింగ్ తో నిరాశపరిచాడు అని చెప్పాలి.


 క్రీజు లోకి వచ్చిన రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే రబాడ బౌలింగ్లో చివరికి వికెట్ కోల్పోయి డకౌట్ గా వెనుతిరిగాడు. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. టి20 ఫార్మాట్లో అత్యధిక సార్లు డక్ ఔట్ అయిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అందరికంటే ముందున్నాడు. ఇప్పుడు వరకు 9సార్లు రోహిత్ డక్ ఔట్ అయ్యాడు. తర్వాత రాహుల్ 5 సార్లు, విరాట్ కోహ్లీ నాలుగు సార్లు డకౌట్ అయిన ప్లేయర్ లుగా ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో  భారత క్రికెట్లో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన లిస్టులో 34 గోల్డెన్ డకౌట్స్ తో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు  కోహ్లీ 33, వీరేంద్ర సెహ్వాగ్   31, సౌరబ్ గంగూలీ 29,రోహిత్ శర్మ 27 డక్ ఔట్లతో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: