ఇటీవల కాలంలో టీమిండియా తుది జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి. టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ సమయంలో కూడా ఇద్దరు ఆటగాళ్ల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు.. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్. ఇద్దరు కూడా గత కొంతకాలం నుంచి టీమిండియా జట్టులో ఫినిషర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు దినేష్ కార్తీక్.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చాడో లేదో భారత జట్టును ఎన్నో రోజులుగా వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక టి20 వరల్డ్ కప్ లో అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు  టి20 వరల్డ్ కప్ లో తుది జట్టును ఎంపిక చేసే విషయంలో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లలో టీమిండియా యాజమాన్యం ఎవరిపై మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఈ క్రమంలోని ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ సెలెక్టర్ సభ కరీం స్పందించాడు. రిషబ్ పంత్ను కాదని టీమిండియా మేనేజ్మెంట్ దినేష్ కార్తీక్ వైపు మొగ్గు చూపడం మంచి నిర్ణయం అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరో స్థానంలో దినేష్ కార్తీక్ లాంటి హిట్టర్ ఉండాలి అనుకోవడంలో తప్పేమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు  ఇప్పటికే టీమ్ ఇండియాకు మంచి కాంబినేషన్ దొరికింది అంటూ తెలిపాడు. అందువల్ల ఇక టి20 వరల్డ్ కప్ లో తుదిచెట్టులో రిషబ్ పంతుకు చోటు దక్కడం అనుమానమే అంటూ సభా కరీం వ్యాఖ్యానించాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: