ఇటీవల భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఇంగ్లాండ్ పర్యటన లో భాగం గా టి20 సిరీస్ ఓడి పోయి, వన్డే సిరీస్ లో విజయం సాధించింది. అయితే ఇక ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన మన్కడింగ్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో చర్చనీయాంశం గా మారి పోయింది అని చెప్పాలి. మ్యాచ్ ఉత్కంఠ భరితం గా జరుగుతున్న సమయం లో ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ ను  మన్కడింగ్  విధానం ద్వారా రన్ అవుట్ చేసింది దీప్తి శర్మ.


 అయితే ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్న ఈ విషయం గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో అస్సలు ఆగడం లేదు అని చెప్పాలి. మొన్నటి వరకు దీపిశర్మ క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది అంట కొంత మంది విమర్శలు చేస్తే.. రూల్ ప్రకారమే ప్రవర్తించి.. జట్టును గెలిపించిందని మరి కొంతమంది ప్రశంసలు కురిపించారు. అయితే ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


 కాగా అటు రిపోర్టర్లు కూడా అందరూ క్రికెటర్లను ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ జోష్ బట్లర్ కి కూడా రిపోర్టర్ల నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై మీ బౌలర్ మన్కడింగ్ చేస్తే మీరు మీ బౌలర్ కి సపోర్ట్ చేస్తారా అంటూ ఒక జర్నలిస్ట్ మీడియా సమావేశంలోఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ను ప్రశ్నించారు. ఇందుకు అతని నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. నేను బౌలర్ను సపోర్ట్ చేయను.. బ్యాట్స్మెన్ ని మళ్ళీ పిలిచి ఆడమని చెబుతాను అంటూ బట్లర్ సమాధానం ఇచ్చాడు. అతను చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి బట్లర్  సమాధానం పై మీరేమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: