సాధారణంగా ఏ ఆటలో అయినా సరే స్పోర్టివ్ నెస్ ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఒక ఆటగాడు విజయాన్ని ఎలా స్వీకరిస్తాడో ఓటమిని కూడా అంతే హుందాగా స్వీకరించాల్సి ఉంటుంది. ఇక ఇలా ఒక ఆటగాడు గెలుపు ఓటమిని ఒకేలా చూసినప్పుడు మాత్రమే కెరియర్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు అన్ని రకాల క్రీడలలో కూడా ఎంతో మంది క్రీడాకారులు అద్భుతమైన విజయం సాధించినప్పుడు పొంగిపోకుండా ఓటమి చెందినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ ఎంతో మంది అభిమానులకు హృదయాలను గెలుచుకున్నారు.


 కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక చివరికి ప్రత్యర్థులతో గొడవ పడటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలీ. సాధారణంగా టెన్నిస్ అనేది ఒక ప్రొఫెషనల్ గేమ్ ఇందులో ఆటగాళ్లు ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం ప్రొఫెషనల్ గేమర్స్ లా కాకుండా ఏకంగా గల్లీ ప్లేయర్ల లాగా బూతులు తిట్టుకోవడం సంచలనంగా మారిపోయింది. ఒకవేళ చైర్ ఎంపైర్ అడ్డు వచ్చి వారిని ఆపకపోయి ఉంటే కచ్చితంగా కొట్టుకునే వారేమో అనేంతలా గొడవ సాగింది.


 ఓర్లిన్స్ ఛాలెంజర్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్లో టాప్ సీడ్ మౌటేట్ 247 వ ర్యాంకర్ ఆండ్రీవ్ లు తలపడ్డారు. కాగా మౌటేట్ ను 2-6, 7 -6,  7-3  తో కంగు తినిపించాడు అని చెప్పాలీ. తద్వారా మౌటేట్ ఓటమి పాలు అయ్యాడు. ఓటమి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇస్తుండగా మౌటేట్ ముందు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఆండ్రివ్ ను బూతులు తిట్టాడు. దీంతో అండ్రివ్ మోటేట్ కు ఎదురెళ్ళాడు. ఒక్కరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో చైర్ ఎంపైర్ వచ్చి వారికి సర్ది చెప్పాడు. ఈ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: