టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమే కొత్త సారధి నేతృత్వంతో సరికొత్తగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఎంతో పటిష్టంగా కనిపించిన టీమిండియాకు మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న సమయంలో మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు వరుసగా గాయాల బారిన పడుతూ చివరికి జట్టుకు దూరం అవుతున్నారు.


 ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాడు దూరం అయ్యాడని అందరూ బాధపడుతూ ఉంటే ఇక ఇప్పుడు బుమ్రా లాంటి కీలక బౌలర్ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలుస్తుంది. వెన్నునొప్పి కారణంగా చివరికి జట్టుకు దూరమయ్యాడు బుమ్రా. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే విషయంపై ఎంతోమంది స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ సెలెక్టర్ సభ కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచించాడు. మహమ్మద్ షమి ఒక అద్భుతమైన బౌలర్ అంటూ చెప్పుకొచ్చాడు.  కొత్త బంతితో టి20 ఫార్మాట్లో వికెట్లు తీసే సత్తా అతనికి ఉంది. పరుగులు కట్టడి చేయగల అనుభవం కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా అతను బాగా రాణించడం శుభ పరిణామం. ప్రస్తుత సమయంలో అలాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ సేవలు భారత్ జట్టుకు ఎంతో అవసరం. ప్రస్తుతం బుమ్రా దూరమైన నేపథ్యంలో షమిని తుది జట్టులోకి తీసుకోకపోతే భారత బౌలింగ్ విభాగం మరింత క్షీణిస్తుంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాలంటే అనుభవం ఉన్న షమీనే కరెక్ట్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సభాకరిమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: