మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. వరల్డ్ కప్లో ప్రత్యర్థులను ఎంతో సమర్థవంతంగా ఢీకొట్టేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి.  ఈ క్రమంలోని ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో ఈసారి వరల్డ్ కప్ పోరు ఎంతో రసవతరంగా మారుతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఇకపోతే వరల్డ్ కప్ లో విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు మిగతా వివరాలు ఏంటి అనే విషయాన్ని ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ వివరాలు చూసుకుంటే..

 టి20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో ఆడే 12 జట్లు కూడా 40 వేల డాలర్లు పొందుతాయి. అంటే దాదాపు 32 లక్షల 60 వేల రూపాయలు. వీటిల్లో గెలిచి సూపర్ 12 రౌండ్ కి అర్హత సాధించిన నాలుగు జట్లు 40 వేల డాలర్లు పొందుతాయి అని చెప్పాలి. ఇక సూపర్ 12 రౌండ్లో ఆడిన 8 జట్లు కూడా తలా 70000 డాలర్లు అంటే 57 లక్షల రూపాయలకు పైగా అందుకు ఉంటాయి. ఇక సూపర్ 12 రౌండ్ లో గెలిచిన ఒక్కో మ్యాచ్ కి అదనంగా 40 వేల డాలర్లు వస్తాయి  ఇక సెమి ఫైనల్ కు చేరిన నాలుగు జట్లు నాలుగు లక్షల డాలర్లు అంటే మూడు కోట్ల 26 లక్షల కు పైగా అందుకుంటాయి.


 ఇక ఫైనల్లో అడుగుపెట్టి ఓడిపోయిన జట్టు 8 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో 6 కోట్ల 52 లక్షల పైగానే అందుకుంటాయి అని చెప్పాలి. ఐసీసీ ఛాంపియన్గా నిలిచిన జట్టుకి ట్రోఫీతో పాటు 16 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ అందుతుంది. అంటే భారత కరెన్సీలో 13 కోట్ల రూపాయలు. అయితే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ విజేతకు వచ్చే ప్రైజ్ మనీతో పోల్చి చూస్తే అటు  ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు వచ్చే ప్రైజ్ మనీ చాలా తక్కువ అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఛాంపియన్గా నిలిచిన జట్టు 20 కోట్లు ప్రైస్ మనీ అందుకుంది. వరల్డ్ కప్ విన్నర్ కి ఇచ్చే మొత్తం కంటే ఏడు కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl