గతంలో తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో చిరస్మరణీయ విజయాల్ని అందించిన క్రికెట్ లెజెండ్స్ అంతా ఒక్క చోటకు చేరారు. సెప్టెంబర్ 10 వ తేదీ నుండి ఇండియా వేదికగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరీస్ సెకండ్ సీజన్ జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పుడు చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. పోటీలో పాల్గొన్న 8 జట్ల నుండి నాలుగు జట్లు మాత్రమే సెమీఫైనల్ కు చేరుకున్నాయి. అందులో ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మరియు వెస్ట్ ఇండీస్ లు ఉన్నాయి. కానీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియా చేతిలో మరియు వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించగా ఇండియా మరియు శ్రీలంక జట్లు ఫైనల్ పోటీకి చేరుకున్నాయి.

ఈ రోజు రాయిపూర్ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. కాగా టోర్నీ ఆసాంతం చేసిన ప్రదర్శన బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇండియా లెజెండ్స్ జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్ లే కావడం విశేషం. ముఖ్యంగా యువరాజ్ సింగ్, పఠాన్ సోదరులు, సురేష్ రైనా, నామన్ ఓజా లు ఇండియా విజయాలతో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించారు. ఇక శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయలేని విధంగా జట్టు కూర్పు ఉంది. ఇక శ్రీలంక ను ఫైనల్ వరకు చేర్చడంలో కెప్టెన్ దిల్షాన్, జయసూర్య, తరంగ, మునవీర, ఉదవట్టే మరియు వాస్ లు కీలక పాత్ర పోషించారు.

ఇక ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతుంది. నిజంగా ఈ మ్యాచ్ అభిమానులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ను అంధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇండియా విజయాన్ని సాధించాలంటే మాత్రం జయసూర్య మరియు దిల్షాన్ లను అడ్డుకోవలసిందే. మరి రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరీస్ సీజన్ 2 ఫైనల్ లో గెలుపు ఎవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: