మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే . అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదిక ఈ మెగా టోర్ని ఆరంభం కానుంది. ఈ క్రమంలోనె అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవడమే  లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇక తమ ప్రత్యర్ధులు  ఎవరు అన్న విషయం అందరికీ క్లారిటీ వచ్చింది   తమ ప్రత్యర్థులను ఎలాంటి వ్యూహాలతో ఎదుర్కోవాలి అన్న విషయంపై ఇప్పటికే ప్లాన్లు సిద్ధం చేసుకున్నాయ్ అన్ని జట్లు.


 ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా టి20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతూ ఉంది.. వరల్డ్ కప్ లో ఏ జట్టు ఆటగాళ్లు ఎలా రానిస్తారు.. అంతేకాకుండా ఏ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ వరకు చేరుకుంటుంది.. టైటిల్ విజేతగా ఈసారి ఎవరు నిలుస్తారు అన్న విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన ఏ చర్చ జరిగినప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతోంది.


 ఇకపోతే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే ఐదుగురు ఆటగాళ్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేసి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వారి పేర్లను పోస్ట్ చేసింది. ఇందులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్,శ్రీలంక నుంచి హసరంగ, ఇంగ్లాండ్ నుంచి బట్లర్ ఇక టీమిండియా నుంచి సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ నుంచి మహమ్మద్ రిజ్వాన్లను ఎంపిక చేసింది. అయితే ఐసీసీ విడుదల చేసిన లిస్టులో అటు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం గమనార్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: