ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారం గా టీమ్ ఇండియా లో అవకాశం దక్కించుకున్న యువ బౌలర్ అర్షదీప్ సింగ్. గత కొంత కాలం నుంచి అద్భుతమైన ప్రదర్శనbతో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరఫున అవకాశం దక్కించుకున్న ప్రతిసారి కూడా తన కట్టుదిట్టమైన బౌలింగ్ తో సీనియర్ల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమం లోనే గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియా తరపున వరుసగా అవకాశాలు దక్కించుకున్న అర్శదీప్ సింగ్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని తన బౌలింతో నిరూపిస్తున్నాడు అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్లో అతనికి కేవలం తక్కువ అనుభవం ఉన్నప్పటికీ కూడా స్టార్ బ్యాట్స్మెన్ లను సైతం తన బౌలింగ్ తో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ముఖ్యం గా డెత్ ఓవర్లలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా కట్టుదిడ్డమైన బంతులను వేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. టీమ్ ఇండియా విజయం లో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అర్షదీప్ సింగ్. ఈ క్రమం లోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ కూడా అటు అర్షదీప్ సింగ్ బౌలింగ్ ప్రతిభ పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్లో వైవిద్యం బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం అర్షదీప్ సింగ్ బౌలింగ్లో ప్రత్యేకతలు అంటూ చెప్పుకొచ్చాడు. తన శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్న విషయం అతనికి బాగా తెలుసు. అతని ప్రతిభ పై అతనికి అవగాహన ఉంది. మానసికం గా ఎంతో బలవంతుడు అంటూ ప్రశంసించాడు. జహీర్ ఖాన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అవసరమైన సమయంలో జట్టులోకి వచ్చిన అర్షదీప్ జహీర్ ఖాన్ ను మరిపిస్తాడు అంటూ కమ్రాన్ అక్మాల్ అర్షదీప్ పై ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: