ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఒక భారత యువ ఆటగాడి గురించి చర్చ గత కొంత కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఆ యువ ఆటగాడు ఎవరో కాదు సూర్య కుమార్ యాదవ్.  జట్టులోకి అందరితో పోల్చి చూస్తే కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ సమయంలోనే తన ఆట తీరుతో ఊహించిన రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు టీమిండియాలో అతనీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక మైదానంలోకి దిగాడు అంటే చాలు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ మెరుపు బ్యాటింగ్ తో ప్రతి మ్యాచ్ లోను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్. మైదానం నలువైపులా కూడా అద్వితీయమైన షాట్లు ఆడుతూ ఇక మిస్టర్ 360 ప్లేయర్ గా అందరి చేత ఒక ప్రత్యేకమైన బిరుదును అందుకున్నాడు అని చెప్పాలి. మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా టీమిండియా విజయంలో అతనిదే కీలకపాత్ర ఉండటం ఖాయం అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇక ఇటీవలే భారత స్టార్ బ్యాట్స్మెన్ మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ పై సౌత్ ఆఫ్రికా ఆటగాడు పార్నల్ ప్రశంసలు కురిపించాడు. సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో అత్యంత శక్తివంతమైన ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు. అతడిని ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదు అంటూ తెలిపాడు. సూర్య కుమార్ బ్యాటింగ్ విధ్వంసాన్ని నిలువరించాలి అంటే బౌలర్లు మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. అతనొక 360 డిగ్రీస్ ప్లేయర్. ఇక ప్రతి బంతిపై కూడా అతను దృష్టి పెడుతూ ఉంటాడు. ఇది ఒక అద్భుతం అంటూ పార్నల్ ప్రశంసలు కురిపించాడు. కాగా ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ ప్రతిభను కొనియాడుతూ ఆకాశానికి ఎత్తేస్తారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: