ఇటీవల కాలంలో టీమిండియా కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఒకవైపు టీమ్ ఇండియా వరల్డ్ కప్ కి ముందు వరుస విజయాలు సాధిస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ సమయంలో కూడా అతడు టీమిండియా కు అందుబాటులో ఉండలేడు అంటూ ఒకసారిగా వార్తలు గుప్పమన్నాయ్.


 దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా దూరమై టీమిండియా కష్టాల్లో పడిపోయింది. ఇక ఇప్పుడు కష్టాల్లో ఆదుకునే బూమ్రా కూడా జట్టుకు దూరం అయ్యాడు అంటే టీమిండియా ప్రపంచకప్ లో బాగా రాణించడం కష్టతరం అవుతుంది అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలోనే బీసీసీఐ  అందరినీ కన్ఫ్యూషన్ లో పడేసింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. బుమ్రా దూరం అయ్యాడని ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ బీసీసీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.


 దీంతో బుమ్రా దూరం అయ్యాడా లేదా అనే కన్ఫ్యూజన్ అందరిలో నెలకొంది. ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి కొన్ని రోజుల్లో బుమ్రా గురించి నిర్ణయం తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అయితే అతను ఇంకా జట్టులోనే ఉన్నాడు అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. బుమ్రా ప్రస్తుతం టీమిండియా కు దూరం కాలేదు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా మొన్న సౌరవ్ గంగూలీ ఇక ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యలతో అసలు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు మరింత కన్ఫ్యూజన్ ఆత్రుత కూడా పెరిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: