మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా అందరూ ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఎలా రాణించ బోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరం గా మారి పోయింది అని చెప్పాలి. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏ మ్యాచ్ లో ఏ జట్టును ఎదుర్కోబోతున్నాము అన్న విషయంపై అన్ని జట్లు క్లారిటీతో ఉన్నాయి. ఇక ఆయా జట్లలో ఆటగాళ్లు ఎవరు ఉన్నారు అన్న విషయం కూడా తెలుసు.


దీంతో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయ్ అన్ని జట్లు. అదే సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్లది కీలక పాత్ర ఉంటుందని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ జట్లకు సంబంధించిన ఆటగాళ్ల ప్రతిభను పోల్చి చూస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిభను కూడా పోల్చి చూస్తూ ఉండడం గమనార్హం. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా,  బెన్ స్టోక్స్ క్లాస్ ప్లేయర్లు అంటూ జాక్వెస్ కలిస్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక వీరిని ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో ఈ ఇద్దరు కూడా తమ జట్టు తరఫున కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు కలిస్. ఈ పోరాటం బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లెజెండ్స్ లీగ్ లో అందరితో కలిసి మరోసారి మైదానంలోకి దిగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు జాక్వెస్ కలిస్.

మరింత సమాచారం తెలుసుకోండి: