సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలెబ్రిటీలతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే క్రికెటర్లకు పాపులారిటీ ఉంటుంది. ఎందుకంటే సినీ సెలబ్రిటీలు కేవలం ఒకే ప్రాంతంలో మాత్రమే క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు. కానీ అటు క్రికెటర్లు మాత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ ప్రతిభతో గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దేశ విదేశాలలో సైతం ఊహించని రీతిలో క్రేత్ సంపాదించుకుంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతారు.


 ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెటర్ల ప్రేమ గురించిన విషయం మీడియా కంట పడింది అంటే చాలు ఇక మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినంత పని అయిపోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియా యువ క్రికెటర్ ప్రేమాయణం గురించిన విషయం కాస్త సోషల్ మీడియాలో బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత క్రికెట్ లో యంగ్ సెన్సేషన్ పృథ్వి షా ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే కాదు దేశవాళీ క్రికెట్లో కూడా తన మార్కు చూపించాడు. ఇకపోతే ఈ యంగ్ క్రికెటర్ నటీ నిధి తుఫాడియాతో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహం ముందు తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు పృథ్వి షా.  నాకు గర్భ డాన్స్ నేర్పినందుకు థాంక్స్ అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇకపోతే ఈ యాంగ్ క్రికెటర్ ప్రేమిస్తున్న ఆ యువతి ఎవరో కాదు ప్రముఖ మోడల్,టీవీ యాక్టర్ కావడం గమనార్కం. అందరిని అలరించిన సిఐడిలో కూడా నటించింది నిధి తుపాడియా.

మరింత సమాచారం తెలుసుకోండి: