ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇక మూడు మ్యాచ్ ల t20 సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వరుసగా రెండు మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఈ టి 20 సిరీస్ ముగిసిన వెంటనే అక్టోబర్ ఆరవ తేదీ నుంచి ఇక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. అయితే టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ.


 ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ లో తలబడేందుకు ప్రత్యేకమైన జట్టును ఎంపిక చేసింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే మరోసారి సీనియర్ బాట్స్మన్ శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ.  కాగా ఇలా శిఖర్ ధావన్ నేతృత్వంలోనీ ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. కాగా సఫారీ లతో జరగబోయే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహిస్తూ ఉండగా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఇక ప్రపంచ కప్ కు  సంజు శాంసన్ ను పక్కనపెట్టి విమర్శలు ఎదుర్కొన్న బీసీసీఐ అతనికి వన్డే సిరీస్లో చోటు కల్పించింది.


 ఐపీఎల్ లో మెరిసి టీమ్ ఇండియాలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రజత్ పాటిదర్, రాహుల్ త్రిపాఠికి జట్టులో స్థానం దక్కింది అని చెప్పాలి. అంతేకాకుండా కుల్దీప్ యాదవ్ రవి బిష్ణయ్, షాబాజ్ అహ్మదులకు కూడా బిసిసిఐ జట్టులో చోటు ఇచ్చింది. బాగాకాగా ఇందులో రజాత్ పాటిదార్, ముఖేష్ కుమార్ లు తొలిసారి టీమిండియాలోకి అరంగేట్రం చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది . మరి ఈ ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఎలా రాణించబోతున్నారు అన్నది చూడాలి.

భారత జట్టు:
శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, రజత్‌ పటిదార్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, షహబాజ్‌ అహ్మద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చహర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: