భారత జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న యార్కర్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రా భారత జట్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు అన్న వార్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టి20 వరల్డ్ కప్ ముందు ఇలా జరిగింది ఏంటి అని అభిమానులు అందరినీ కూడా ఈ వార్త నిరాశలో మునిగిపోయేలా చేస్తూ ఉంది. అయితే  జస్ప్రిత్ బుమ్రాకు ఫ్రాక్చర్ అయ్యిందని ఈ క్రమంలోనే సర్జరీ చేయించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.


 ఇక ఈ సర్జరీ కారణంగా అతనికి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని తద్వారా అతను వరల్డ్ కప్ లో జట్టుకు అందుబాటులో ఉండడం కష్టం అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు బుమ్రా గాయం పై అటు బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. బుమ్రా ఇంకా వరల్డ్ కప్ నుంచి తప్పుకోలేదు అంటూ గంగూలీ చెబితే.. బుమ్రా ఇంకా జట్టుతోనే ఉన్నాడు అని కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత కన్ఫ్యూషన్ లో పడేసాడు. ఈ క్రమంలోనే బుమ్రా గాయం పై అటు బీసీసీఐ ఒక క్లారిటీ ఇస్తుందేమో అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు.


 ఈ క్రమంలోనే బుమ్రా వెన్నుముక్క ఫ్రాక్చర్ అయిందని ఇక సర్జరీ కూడా చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలపై ఇటీవల బీసీసీఐ మెడికల్ టీం ఒక క్లారిటీ ఇచ్చింది. బుమ్రాకు వెన్నుముక ఫ్రాక్చర్ అయ్యింది అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. కేవలం చిన్న గాయం మాత్రమే అయింది అంటూ బీసీసీఐ మెడికల్ టీం స్పష్టం చేసింది. ఇందుకోసం నాలుగు నుంచి ఆరు వారాలపాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ మెడికల్ టీం తెలిపింది. ఏది ఏమైనా అటు బుమ్రా వరల్డ్ కప్ కి అందుబాటులో ఉండడం లేదు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇదే జరిగితే టీమిండియా కు వరల్డ్ కప్ గెలవడం ఎంతో కష్టంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: