సాధారణంగా మనం పోలీస్ శాఖలో ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. ఏకంగా తండ్రి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉంటే కూతురు మాత్రం ఏకంగా ఐపీఎస్ చదివి ఉన్నతాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏకంగా తండ్రి చేతనే సెల్యూట్ కొట్టించుకోవడం లాంటివి ఘటనలు అందరిని ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు ఎంతోమంది విషయంలో ఇలాంటివి జరిగాయి అని చెప్పాలి.  కానీ క్రికెట్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అంటే ప్రస్తుతం జరిగిన ఘటన చూస్తే మాత్రం అవును అనే సమాధానమే వినిపిస్తుంది. క్రికెట్ లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదు అని చెప్పాలి.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం మహిళల ఆసియా కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగానే జరుగుతుంది.. ఇక ఈ పోరును చూసేందుకు అటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఇకపోతే ఇటీవలే మహిళల ఆసియా కప్ లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. ఒక మ్యాచ్ లో భాగంగా తల్లి ఎంపైర్గా విధులు నిర్వహిస్తూ ఉంటే.. కూతురు క్రికెటర్ గా మైదానంలో మ్యాచ్ ఆడుతూ ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 పాకిస్తాన్ మహిళల జట్టులో సభ్యురాలుగా ఉన్న కైసత్ ఆల్ రౌండర్ గా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.  ఇటీవల ఒక మ్యాచ్ సమయంలో ఇక కైసత్ తల్లి సలీమా ఇంతియాజ్ అంపైర్గా వ్యవహరించడం గమనార్హం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మహిళా క్రికెటర్ కైసత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగాపూరితమైన పోస్ట్ పెట్టింది. మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమెకు అడుగడుగున అండగా నిలబడిన మా నాన్నకు శుభాకాంక్షలు.. మా నాన్న మా అమ్మను ప్రోత్సహించినట్లుగానే ఇప్పుడు నా భర్త నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉంటున్నాడు అంటూ కామెంట్ చేసింది కైసత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: