ఇటీవల సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ రసవతరంగా  సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరికి భారత జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు విజయం సాధించినప్పటికీ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ సెంచరీ మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.. భారత జట్టు భారీ స్కోరు చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే అటు డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ముందు భారత జట్టుకు ఓటమి తప్పేది కాదు అంటూ ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి.


 జయాపజయాల విషయం అటు ఉంచితే.. ఇటీవల సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో మాత్రం ఐసిసి తీసుకువచ్చిన కొత్త రూల్స్ ని మరిచిపోయారు. కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు రూల్స్ ని గుర్తు చేయాల్సిన అంపైర్లు కూడా కొత్త రూల్స్ పట్టించుకోకపోవడం గమనార్హం. అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మ్యాచ్ టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మద్యే కావడం గమనార్గం. కానీ కొత్త రూల్స్ ని అమలు చేయాల్సిన అంపైర్లు చివరికి ఈ నిబంధనలు మరిచిపోవడం గమనార్హం.


 కొత్త నిబంధనల ప్రకారం స్ట్రైకర్ షాట్ కొట్టి అవుట్ అయితే పరుగు తీసే ప్రయత్నం చేస్తూ నాన్ స్ట్రైకర్  అతనిని దాటినా సరే కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్ స్ట్రైకింగ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో రెండో ఓవర్లో నాలుగో బంతికి రోసో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొత్త రూల్స్ పాటించకుండా ఐదో బంతికి ఢీకాక్ స్ట్రైక్ తీసుకున్నాడు.. వాస్తవానికి మార్కరమ్ స్ట్రైక్ తీసుకోవాల్సింది. కానీ అంపైర్లు కూడా దీనిని గుర్తించలేకపోయారు. ఇక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ తొలి మ్యాచ్ కదా అందుకే అంపైర్లు కూడా రూల్స్ మర్చిపోయినట్టున్నారు. కొత్త రూల్స్ కి అలవాటు పడడానికి అంపైర్లకు కూడా కాస్త సమయం పడుతుంది అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: