జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి వరుసగా విజయాలు అందిస్తాడు అనుకున్న బుమ్రా టి20 వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే బుమ్రా దూరం అవడం ఒక ఎత్తు అయితే అతని స్థానంలో జట్టులోకి ఎవరు రాబోతున్నారు అన్నది మరో ఎత్తు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతను స్థానంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు అని చెప్పాలి.


 అదే సమయంలో ఇక బుమ్రా గాయం కారనంగా దూరం కావడంతో టి20 వరల్డ్ కప్ లో అటు టీమిండియా కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి అన్న విషయంపై కూడా ఎంతోమంది ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే బుమ్రా లేకపోవడంతో గత కొంతకాలం నుంచి టీమిండియా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటున్నారు అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే  అతని స్థానంలో ఎంతో అనుభవజ్ఞుడైన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీను తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



 ఇంగ్లాండ్ పిచ్ లపై మహమ్మద్ షమి బాగా రాణించగలడని అంతేకాదు వికెట్ టేకర్ గా నిలుస్తాడని. డెత్ ఓవర్లలో కూడా మెరుగైన బౌలింగ్ ప్రతిభ కనబరిస్తాడని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక బుమ్రా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతన్ని స్థానాన్ని భర్తీ చేయగల అసలు సిసలైన ఆటగాడు కేవలం సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి మాత్రమే అంటూ చెబుతున్నారు అని చెప్పాడు. ఇక బిసిసిఐ కూడా అటు బుమ్రా స్థానంలో షమీను తుది జట్టులోకి  తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తితో ఉంది అన్న టాక్ ప్రస్తుతం మొదలైంది అని చెప్పాలి. మరి బీసీసీఐ ఏం చేయబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: