ప్రస్తుతం టెంబ బావుమా నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా జట్టు ఇండియా పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్యన టీ 20 మరియు వన్ డే సీరీస్ లను ఆడేందుకు షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యుల్ లో భాగంగా 3 టీ 20 ల సీరీస్ ను ఇండియా 2-1 తేడాతో గెలుచుకుని రికార్డ్ సాధించింది. ఒక మూడు వన్ డే ల సీరీస్ ఈ రోజు నుండి మొదలు కానుంది. కాగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ లక్నో వేదికగా మొదలు కానుంది. అయితే ఈ వన్ డే సీరీస్ కు పూర్తిగా సీనియర్ జట్టు దూరం అయిన విషయం తెలిసిందే. ఇంకో పది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని వారికి యాజమాన్యం విశ్రాంతి ఇచ్చింది.

ఈ జట్టుకు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ టీమ్ లో శ్రేయాస్ అయ్యర్, శుబ్ మాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్ళు చోటు సంపాదించారు. ఈ సీరీస్ లో బాగా ఆడితే ముందు ముందు ఎక్కువ సీరీస్ లలో అవకాశం దక్కించుకోవచ్చు . కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి శ్రేయాస్ అయ్యర్ లకు కఠిన పరీక్ష లాంటిది. సంజు శాంసన్ అడపా దడపా ఆడుతున్నా ఫేమ్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు.

ఇక శ్రేయాస్ అయ్యర్ సైతం టీం యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోలేక టీ 20 వరల్డ్ కప్ లో మెయిన్ ప్లేయర్ గా స్థానాన్ని కోల్పోయాడు. ఈ మూడు వన్ డే ల సిరీస్ లో బాగా రాణించి ఏ ఫార్మాట్ లో అయినా తుది జట్టులో ఉండగలిగే ప్లేయర్ అని ప్రూవ్ చేసుకుంటాడా లేదా చూడాలి. వీరు మాత్రమే కాకుండా మరికొందరు యంగ్ ప్లేయర్స్ కు కూడా ఈ సిరీస్ ఒక సువర్ణావకాశం అని చెప్పాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: