ఇటీవల కాలంలో రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతున్నాయి అంటే చాలు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విశ్లేషణలు చెబుతూ ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు చెబుతున్న విశ్లేషణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. ఏ జట్టు ఎలా రాణించబోతుంది ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అనే విషయంపై ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే ద్వైపాక్షిక  సిరీస్ ల సమయంలోనే రివ్యూలు చెప్పిన వారు  ఇక వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రివ్యూలు చెప్పకుండా ఉంటారా.


 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎవరు బాగా రాణిస్తారు అన్న విషయంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అదే సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ లో నిలిచే జట్లు ఏవి అన్న విషయంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తమ అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ లో టైటిల్ రేసులో నిలిచే జట్లు ఏవి అన్న విషయాలను చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మైఖేల్ బేవాన్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.



 ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో భాగంగా కేవలం మూడు జట్లు మాత్రమే టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియన్ మాజీ బ్యాట్స్మెన్ మైఖేల్ బేవాన్ చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఉన్నా ఫామ్ దృశ్య అన్ని జట్లకంటే భారత్ ఇంగ్లాండ్ అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై  వరల్డ్ కప్  జరుగుతూ ఉండడంతో ఇక స్వదేశీ పరిస్థితిలను అటు ఆస్ట్రేలియా ఉపయోగించుకుంటుందని అందుకే ఆస్ట్రేలియా కూడా టైటిల్ గెల్పొందే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  మైకల్ బేవాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: