హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ గత కొంతకాలం నుంచి టీమిండియా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు వరుసగా అవకాశాలు దక్కించుకున్న మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు మాత్రం అదే రీతిగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవల బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇక మహమ్మద్ సిరాజ్ కి ఒక లక్కీ ఛాన్స్ దొరికింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అసలు t20 సిరీస్ జట్టులో అతని పరిగణలోకి తీసుకొని సెలెక్టర్లు ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడవ టి20 లో తుది జట్టులో ఆడించారు.


 అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మహమ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతో అదరగొడతాడని అందరూ భావించారు. కానీ అటు మొహమ్మద్ సిరాజ్ కి మాత్రం రీ ఎంట్రీ ఏమాత్రం కలిసి రాలేదు అన్నది తెలుస్తుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడవ టి20 మ్యాచ్లో ఎందుకో స్థాయి మేరా ప్రదర్శన చేయలేకపోయాడు సిరాజ్. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అంతేకాదు 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇవి సరిపోవు అన్నట్లుగా అటు ఫీల్డింగ్ లో కూడా ఎన్నో తప్పిదాలు చేశాడు అని చెప్పాలి. దీపక్ చాహర్, కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ చేసిన తప్పిదం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


 అప్పటికే పరుగుల వరద పారించిన సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాట్స్మెన్ దీపక్ చాహార్ బౌలింగ్ వేసిన చివరి ఓవర్లో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఓవర్ ఐదో బంతిని డేవిడ్ మిల్లర్ గాల్లోకి బాదాడు. అయితే అది కాస్త లాంగ్ ఆఫ్ లో ఉన్న సిరాజ్ వైపుగా వెళ్ళింది.  కాస్త చాకచక్యంతో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పటాల్సిన సిరాజ్ తబడ్డాడు. అనుకున్నట్లుగా సమర్థవంతంగా క్యాచ్ అయితే పట్టాడు కానీ తొందరపాటులో బౌండరీ లైన్ పై అడుగుపెట్టాడు. దీంతో అది సిక్సర్ గా మారిపోయింది. దీంతో బౌలర్ దీపక్ చాహార్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇదేం ఫీల్డింగ్ రా బాబు అన్నట్లుగా రోహిత్ ఒక లుక్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: