అక్టోబర్ 1 నుండి మహిళల ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పురుషుల ఆసియా కప్ ముగిసింది. అందులో విజేతగా శ్రీలంక నిలిచింది. ప్రస్తుతం మహిళల ఆసియా కప్ లో ఎవరు గెలవనున్నారు అన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా మరియు యూఏఈ జట్లు ఉన్నాయి. అయితే ఈ గ్రూప్ స్టేజ్ లో నాక్ అవుట్ కు అర్హత సాధించేది మొదటి నాలుగు జట్లు అని తెలిసిందే. అందులో ఇండియా, పాక్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లు ఉంటాయి. అయితే ఈ రోజు పొద్దున్న జరిగిన మ్యాచ్ ఫలితం చూస్తే మాత్రం ఇది తప్పు అయ్యే అవకాశం ఉంది.

షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఉదయం పాకిస్తాన్ మరియు థాయిలాండ్ ల మధ్యన మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో వికెట్ల 5 నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ ఆటగాళ్లను థాయిలాండ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ కు ఓపెనర్ నత్తకం చంతం అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. చంతం అర్ద సెంచరీ (61) సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే పాకిస్తాన్ తమ అనుభవంతో ఆఖర్లో వికెట్లు తీసినా ఎక్సట్రాలు వేసి థాయిలాండ్ కు విజయాన్ని అందించింది పాక్... అలా థాయిలాండ్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ ను ఓడించి రికార్డు సృష్టించింది.

థాయిలాండ్ ఇదే విధంగా మరో టీం ను ఓడించిందా టాప్ 4 లో మార్పులు జరగడం ఖాయం. మరి పాకిస్తాన్ ఈ దారుణ ఓటమి నుండి తేరుకుని మంచి కమ్ బ్యాక్ ఇస్తుందా చూడాలి. ఇక ఈ రోజు జరుగుతున్న మరో మ్యాచ్ లో బంగ్లా తో మలేషియా ఆడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: