సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారిన తర్వాత అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అమలు చేసే అన్ని రకాల నిబంధనలను అటు క్రికెటర్లు పాటించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏమాత్రం పొరపాట్లు చేసిన కూడా చివరికి క్రికెటర్ల పై చర్యలు తీసుకునేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో ఏకంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా విషయంలో  దురుసుగా ప్రవర్తించిన ఆటగాళ్లపై ఏకంగా మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు మరికొన్ని రకాల పనిష్మెంట్లు ఇవ్వడం లాంటిది కూడా చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే నిబంధనలు పట్టించుకోకుండా ఎవరైనా క్రికెటర్ కాస్త అతి చేశాడు అంటే చాలు చివరికి అతనిపై నిషేధం విధించడం లాంటిది కూడా చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. కేవలం ఐసీసీ మాత్రమే కాదు అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఇప్పటివరకు ఎంతోమంది క్రికెటర్లపై వివిధ కారణాలతో నిషేధం విధించిన ఘటనలు ఎన్నో తెరమీదికి వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇటీవల వెస్టిండీస్ బ్యాట్స్మెన్ పై ఏకంగా నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ జాన్ క్యాంప్ బెల్ పై ఇలా నిషేధ విధించారు. యాంటీ డొపింగ్ రూల్ నిబంధనను అతిక్రమించినందుకు గాను ఇక ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు జమైక యాంటీ డోపింగ్ కమిషన్ వెల్లడించింది అని చెప్పాలి. క్యాంపు బెల్ వెస్టిండీస్ తరుపున ఇప్పటివరకు 20 టెస్ట్ లు ఆరు వన్డేలు రెండు టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇక ఇప్పుడు అధికారులు అతనిపై విధించిన నిషేధం కారణంగా ఇక అతను నాలుగేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కి దూరం కాబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: