గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ మేనియా కొనసాగుతుంది అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, కామెంటెటర్లు ఇలా అందరూ కూడా సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్న అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి చర్చించుకుంటున్నారు. టీమిండియా తరఫున ఎప్పుడు భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. సూర్య కుమార్ యాదవ్ జట్టులో ఉన్నాడు అంటే చాలు అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది అన్నట్లుగా ప్రదర్శన చేస్తున్నాడు.


 ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించబోతున్నాడు అని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అతను ఒక గొప్ప ఆటగాడు అంటూ ఎంతో మంది సోషల్ మీడియా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ముక్కోన ట20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ ను పాకిస్తాన్ మట్టి కరిపించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 సూర్య కుమార్ మంచి ఆటగాడని అతని మాట తీరు తనకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు మహమ్మద్ రిజ్వాన్. అతను షాట్లు ఆడే విధానం తనకు బాగా నచ్చుతుంది అంటూ తెలిపాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభించడానికి.. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి మాత్రం ఎంతో వ్యత్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. చివరిగా తాను ర్యాంకింగ్స్ గురించి అస్సలు పట్టించుకోను అంటూ తెలిపాడు.  తనకు ఎప్పుడు జట్టు ప్రయోజనాలే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు మహమ్మద్ రిజ్వాన్. మహమ్మద్ రిజ్వాన్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మాత్రం కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. గొప్పలు చెప్పుకోవడంలో పాకిస్తాన్ క్రికెటర్ల తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: