గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియా తరపున కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. అందరితో పోల్చి చూస్తేకాస్త లేటుగానే టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నప్పటికీ తనదైన అటు తీరు తో మాత్రం అందరికంటే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. నాలుగవ స్థానం లో బ్యాటింగ్కు దిగుతూ భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమం లోనే తక్కువ సమయం లోనే ఇక నాలుగవ స్థానం లోఎంతో నమ్మకమైన ప్లేయర్ గా సూర్య కుమార్ యాదవ్ మారి పోయాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇప్పటికే టీమిండియా తరఫున బాగా రానించి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన సూర్య కుమార్ యాదవ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించబోతున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పిచ్ లపై సూర్యకుమార్ ఎలా రాణించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టి అక్కడికి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ టీమిండియా బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసేందుకు ఎంతగానో ఎదురు చూశాను. గ్రౌండ్ లోకి అడుగుపెట్టి ఇక్కడి వికెట్ పై ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాను. పిచ్ పై బౌన్స్ ఉన్నట్టు తొలి సెషన్ ప్రాక్టీస్ లో గమనించాను. తొలి నెట్ ప్రాక్టీస్ అద్భుతంగా ఉంది అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో ఉండే బౌన్స్ పిచ్లపై సూర్యకుమార్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: