గత కొన్నేళ్ల  నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతూ దూసుకుపోతుంది టీమిండియా. ఇకపోతే ప్రస్తుతం భారత్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు రెండవ మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా  పుంజుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి.


 వన్డే మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత  50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత భారత జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు అని చెప్పాలి. కెప్టెన్ శిఖర్ ధావన్ 13 పరుగులు.. ఓపెనర్ శుభమన్ గిల్ 28 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ క్రీజులో 93 పరుగులతో పాతుకుపోయాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అయితే 113 పరుగులతో సెంచరీ చేసేసాడు. సంజు శాంసన్ 30 పరుగులతో రాణించాడు.


 తద్వారా 45.5 ఓవర్లలోనే భారత జట్టు టార్గెట్ ను చేదించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సౌత్ ఆఫ్రికా పై రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా అటు టీమ్ ఇండియా అంతర్జాతీయ క్రికెట్లో ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్డే ఫార్మాట్లో లక్షచేదనలో టీమిండియా అన్ని జట్ల కంటే అత్యుత్తమమైనది అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా జట్టు. ఎందుకంటే ఇటీవల సౌత్ ఆఫ్రికా పై గెలిచిన రెండవ వన్డే మ్యాచ్ అటు టీమ్ ఇండియాకు లక్ష్య  చేదనలో 300వ విజయం కావడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఛేజింగ్ లో ఇప్పటివరకు వన్డే ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్,మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, కింగ్ కోహ్లీ తదితరులు టీమ్ ఇండియాను లక్ష్య చేదనలో  మేటి జట్టుగా నిలపడంలో కీలకపాత్ర వహించారు అని చెప్పాలి. అయితే లక్ష్య చేదనలో  300 విజయాలతో టీమిండియా టాప్ లో కొనసాగుతూ ఉండగా.. ఆ తర్వాత 257 విజయాలతో ఆస్ట్రేలియా 247 విజయాలతో వెస్టిండీస్ వరుసగా రెండు స్థానాల్లో ఉన్నాయి అని చెప్పాలి. టీమిండియా  అరుదైన రికార్డు సాధించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: