మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు తమతైన శైలిలో రివ్యూ చెప్పడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే టి20 వరల్డ్ కప్ లో ఆడిన రోహిత్ శర్మ మొదటిసారి కెప్టెన్ హోదాలో టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి రోహిత్ శర్మ టీమిండియా కు వరల్డ్ కప్ అందిస్తాడని అందరూ బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మను నాలుగు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం..


 యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ 2010లో ప్రపంచ కప్ లో వెస్టిండీస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సమయంలో 66 బంతుల్లో 98 పరుగులు చేయగా ఈ మెగా టోర్నీలో కెప్టెన్ గా ఇదే అత్యధిక స్కోర్. ఇప్పుడు రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది అని చెప్పాలి.


 అయితే ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక లెజెండరీ బ్యాట్స్మెన్ మహేళా జయవర్ధనె అత్యధిక పరుగులు సాధించిన వీరుడుగా కొనసాగుతున్నాడు. మొత్తంగా టి20 వరల్డ్ కపులో కలిపి ఒక 1016 పరుగులు సాధించాడు. జయవర్ధన్ తర్వాత క్రిస్ గేల్ 965,, తిలకరత్నే దిల్షాన్ 897, రోహిత్ శర్మ 847 పరుగులు సాధించి వరుసగా ఈ లిస్టులో ఉన్నారు. కాగా ఈ టి20 వరల్డ్ కప్లో 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగులు సాధించిన వీరుడుగా రికార్డు సృష్టిస్తాడు.


 కాగా 2007లో టీమిండియా తరఫున తొలి టి20 మ్యాచ్ ఆడాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వరకు 33 మ్యాచ్ లు ఆడాడు. అయితే మరో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు అంటే ప్రపంచకప్ తో  అత్యధిక మ్యాచ్ లు ఆడిన క్రికెటర్గా నిలుస్తాడు. ధోని క్రిస్ గేల్ పేరిట ఉన్న 35 మ్యాచ్ల రికార్డును బద్దలు కొడతాడు.


 ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్ ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు అని చెప్పాలి. మరో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే చాలు ఈ మెగా ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు  మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 33 సిక్సర్ల రికార్డును బద్దలు కొడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: