అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదిక టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది.  అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్. ఇలాంటి సమయంలో జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆటగాళ్లు చివరికి గాయాల బారిన పడి జట్టుకు దూరం అవడంతో ఇక అన్ని జట్ల ప్రణాళికలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి.. కేవలం భారత జట్టు విషయంలోనే కాదు టి20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే మరికొన్ని జట్ల విషయంలో కూడా ఇదే జరిగింది.


 ఈ క్రమంలోనే ఇలా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆయా జట్లకు దూరమైన ఆటగాళ్లతో ఏకంగా ఒక సరికొత్త టీం సిద్ధం చేయవచ్చు అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  దాదాపు ఒక్కో జట్టు నుంచి ఒకరిద్దరూ ఆటగాళ్లు చివరికి ప్రపంచ కప్ కు గాయం కారణంగా దూరం అవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఆయా జట్ల నుంచి ఇక వరల్డ్ కప్ కు దూరమవుతున్న ఆటగాళ్ల వివరాలు ప్రస్తుతం వైరల్ గా మారిపోతున్నాయి. ఇలా గాయం కారణంగా వరల్డ్ కప్ మిస్ అయిన ఆటగాలతో ఒక టీం తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..


 జానీ బెయిర్ స్ట్రో,  హెట్ మేయర్, వాన్ డర్ డసన్, రస్సెల్, జడేజా, ప్రిటోరియస్, బుమ్రా, సునీల్ నరైన్, దీపక్ చోహార్,  జోఫ్రా ఆర్చర్, నాదన్ ఎల్లిస్.. ఇలా వరల్డ్ కప్ మిస్ అయిన ఆటగాళ్లతో ఒక పటిష్టమైన జట్టు తయారవుతుంది అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు ఫన్నీగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏదేమైనా ఇక ఇలా గాయం కారణంగా కీలక ఆటగాళ్లు దూరం అవ్వడంతోఎన్నో జట్లకు ఎదురు దెబ్బలు తగిలాయ్. మరి కీలక ఆటగాళ్లు లేకుండా ఆయా జట్లు ఎలా రాణిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: