టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో అటు అభిమానుల దృష్టిని అంతా ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలోసెన్సేషన్ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచే ఇక రాబోయే వరల్డ్ కప్ లో ఎవరు ఎక్కువ బాగా రాణిస్తారు ఎక్కువ పరుగులు చేసేది ఎవరు అనే విషయంపై ఆసక్తికర పోస్టులు పెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ కప్ లో డేంజరస్ డెవలప్ ఎవరు అనే విషయం ఇటీవలే ఐసీసీ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంకా ఇప్పుడు మరోసారి ఇలాంటి పోస్ట్ పెట్టింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.


 నేటి నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో పవర్ఫుల్ బ్యాట్స్మెన్లు ఎవరు అన్న విషయాన్ని ఒక లిస్టు గా తయారుచేసి ఐసీసీ ప్రకటించింది అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్, స్ట్రైక్ రేట్ ఆధారంగా ఇక కొంతమంది ఆటకాళ్లను ఎంపిక చేసింది అని చెప్పాలి. ఇక ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో 176.81 స్ట్రైక్ రేట్ తో టీం ఇండియా బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానం దక్కించుకున్నాడు  గత కొంతకాలం నుంచి సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విషయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన డేంజరస్ బ్యాట్స్మెన్ల లిస్టులో కూడా టాప్ ప్లేస్ లో కొనసాగాడు అని చెప్పాలి. ఇక సూర్య కుమార్ యాదవ్ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్స్ జిమ్మి నీషం, ఫిన్ అలెన్, ఆస్ట్రేలియా  నుంచి టిమ్ డేవిడ్, మ్యాక్స్ వెల్,  వెస్టిండీస్ ఏవీన్ లూయిస్,  సౌత్ ఆఫ్రికా నుంచి రిలీ రోస్సో, మార్కరమ్ లాంటి క్రికెటర్లను డేంజరస్ బ్యాట్స్మన్ లుగా అభివర్ణించింది ఐసిసి.

మరింత సమాచారం తెలుసుకోండి: