ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ను శాసించి హవా నడిపించింది వెస్టిండీస్ జట్టు. వెస్టిండీస్ జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా అదిరిపోయే హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ కి మారుపేరు అని అందరూ చెబుతూ ఉంటారు. ఇక ప్రత్యర్థులు వెస్టిండీస్ తో మ్యాచ్ అంటే చాలు భయపడిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ జట్టు నుంచి ఎంతోమంది స్టార్లు హవా నడిపించారు అని చెప్పాలి. ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.



 ఇప్పుడు వరకు రెండు సార్లు టి20 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుగా సగర్వంగా ప్రపంచకప్ లో అడుగుపెట్టాల్సిన వెస్టిండీస్ జట్టు ఇక ఇప్పుడు అదే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది అని చెప్పాలి. 2012, 2016 లో కూడా పొట్టి ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా నిలిచి తమ సత్తా ఏంటో చూపించింది వెస్టిండీస్ జట్టు. అయితే తొలిసారి టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా కు కూడా ఇప్పటివరకు రెండోసారి ప్రపంచ కప్ గెలుచుకోవడం సాధ్యం కాలేదు. కానీ ఇక ఇలాంటి రికార్డును సాధించింది వెస్టిండీస్.


 ఇప్పుడు ప్రపంచకప్లో ఆడటానికి క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతుంది అని చెప్పాలి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ కప్ లో క్వాలిఫైయర్ మ్యాచ్ లలో భాగంగా నేడు స్కాట్లాండ్ తో తలబడబోతుంది వెస్టిండీస్ జట్టు. అయితే గ్రూప్ దశను దాటితేనే వెస్టిండీస్ జట్టు సూపర్ 12 లోకి అడుగుపెడుతుంది అని చెప్పాలి. అయితే వెస్టిండీస్ పై ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ అద్భుతాలు చేయడంలో వెస్టిండీస్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే విజయాలతో సూపర్ 12 లోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: