గత కొంతకాలం నుంచి టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అసమాన్యమైన ప్రతిభ పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉండడం పై అటు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే ఇక ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ ఆడేందుకు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టగా.. ఇక జట్టులోనే కొనసాగుతున్నాడు సూర్య కుమార్ యాదవ్.


 కాగా ప్రస్తుతం టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో మునిగి తేలుతుంది అని చెప్పాలి. ఇటీవలే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఆరు పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఎప్పటి లాగానే సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్ కి పని చెప్పి హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు ఆస్ట్రేలియా బౌలర్ రీఛర్జ్ సన్. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాడు.


 టి20 ఫార్ముట్ లో సూర్య కుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు. సూర్య కుమార్ యాదవ్ మా జట్టుపై  బ్యాటుకు బంతి మిడిల్ కాకుండా అవుట్ కావడం ఇదే మొదటిసారి అని అనుకుంటున్నా.. ఇప్పుడున్న టి20 బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ అత్యుత్తమమైన  ఆటగాడు... అలాంటి ఆటగాడు వికెట్ తీయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాగే ప్రారంభించాలని ఏమీ అనుకూని రాలేదు అంటూ రీఛర్జ్ సన్ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రత్యర్థి జట్టు బౌలర్ సూర్య కుమార్ పై ప్రశంసలు కురిపించడంపై మిస్టర్ 360 ప్లేయర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: