ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ 2022 లో క్వాలిఫైయర్ మ్యాచ్ కు అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియా లో జరుగతున్నాయి. రోజుకి రెండు మ్యాచ్ ల చొప్పున ఉదయం మరియు మధ్యాహ్నం ప్లాన్ చేశారు ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్ 12 కు అర్హత సాధించాయి ..కానీ ఇంకా నాలుగు జట్లు సూపర్ 12 కు వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఇందులో భాగంగా ఒక గ్రూప్ లో వెస్ట్ ఇండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు జింబాబ్వే లు ఉన్నాయి. ఇందులో ప్రతి టీమ్ మూడు మ్యాచ్ లు ఆడుతుంది, అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి రెండు జట్లు సూపర్ 12 కు వెళ్లనున్నాయి.

కానీ ఇప్పటికే జింబాబ్వే ఆడిన ఒక మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలవగా, స్కాట్లాండ్ వెస్ట్ ఇండీస్ ను ఓడించింది.. అలా ఐర్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు ఇంకా ఖాతా తెరవలేదు. ఇరు జట్లకు ఇంకా రేణుడి మ్యాచ్ లు ఉన్నాయి. ఖచ్చితంగా రెండూ గెలవాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు జరిగిన మొదటి మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఐర్లాండ్ గెలిచి సమీకరణాలను ఇంకా కష్టం చేసింది అని చెప్పాలి. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ కనుక సూపర్ 12 కు చేరాలంటే ఖచ్చితంగా తర్వాత జింబాబ్వే మరియు ఐర్లాండ్ లతో గెలవక తప్పదు. మరియు రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోవలసి వస్తుంది.

ఇంకాసేపట్లో జింబాబ్వే తో తలపడనున్న వెస్ట్ ఇండీస్ గెలుపు కోసం మరియు రన్ రేట్ పై దృష్టి పెట్టాలి. అప్పుడు జింబాబ్వే 2 మ్యాచ్ లలో ఒకటి, ఐర్లాండ్ 2 లో ఒకటి మరియు స్కాట్లాండ్ సైతం 2 లో ఒకటి గెలిచినట్లు అవుతుంది. అప్పుడు మిగిలిన మూడవ మ్యాచ్ లో గెలిచినా రెండు జట్లు సూపర్ 12 కు వెళతాయి. ఓడిపోయిన జట్లు అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుని ఇంటి ముఖం పడతాయి. మరి వెస్ట్ ఇండీస్ తన రెండు మ్యాచ్ లలో గెలిచి సూపర్ 12 కు వెళుతుందా అన్నది తెలియాలంటే ఈ మ్యాచ్ ఫలితం వరకు ఆగాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: