క్రికెట్ అంటే సిక్సర్లు ఫోర్లు మాత్రమే. ఇక ఇవే అటు ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. అంతేకాదు  మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి సిక్సర్లు, ఫోర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టే ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టి20 ఫార్మాట్ ను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లో టి20 మ్యాచ్ జరిగితేనే అటు సంబరపడిపోతూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అలాంటిది ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమైతే క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా పండగ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇటీవలే అక్టోబర్ 16వ తేదీన టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్రికెట్ పండగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి. ఇక టి20 క్రికెట్లో భాగంగా ఆటగాళ్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇక ఇటీవలే టి20 ప్రపంచ కప్ మొదటి గ్రూప్ లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక భారీ సిక్సర్ నమోదయింది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలి ఈ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. అయితే వెస్టిండీస్ హిట్టర్లు ఎంత భారీ సిక్సర్లు కొట్టగలరు ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు.


 ఇటీవల జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే మరోసారి రుజువు అయింది. చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్న రోమన్ పావెల్ భారీ సిక్సర్ బాదడు. ఏకంగా 137 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని అదే వేగంతో కొట్టాడు. ఈ క్రమంలోనే బంతి స్టేడియం బయటపడింది. ఇక ఈ సిక్సర్ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్ళింది అని చెప్పాలి. అయితే రోమన్ పావల్ కొట్టిన సిక్సర్ తో మరో ఎండ్ లో ఉన్న అకీర్ హుస్సేన్ సైతం ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా  వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: