టి20 ఫార్మాట్ అంటేనే రికార్డుల మోత అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది బ్యాట్స్మెన్లు బౌలర్లు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తారు. కాబట్టి ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఎన్నో రకాల రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొంతమంది ఆటగాళ్లు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం మాత్రం మిగతా ప్లేయర్లకు కాస్త కష్టతరమే అవుతుంది. ఇలా వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఐదు రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు అవి ఏంటో తెలుసుకుందాం..

1. టి20 ప్రపంచ కప్ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు. ఛాన్స్ దొరికిన దొరకకపోయినా బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు బ్యాట్స్మెన్లు. అయితే ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ 63 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. అతనికి దగ్గరలో కూడా ఎవరూ లేరు. తర్వాత స్థానంలో యువరాజ్ సింగ్ 33 సిక్సర్లు, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ 31 సిక్సర్లతో ఉన్నారు.

2. అయితే 2007లో టి20 ప్రపంచ కప్ లో అత్యంత బిగ్ టార్గెట్ నమోదయింది. శ్రీలంక, కన్యాల మధ్య జరిగిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 260 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా టి20 ప్రపంచ కప్ లో ఇంత భారీ స్కోర్ చేయలేదు. తర్వాత కెన్యా 88 పరుగులకు ఆల్ అవుట్ అయింది.


3. ఇక టి20 ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ 50 రికార్డును కూడా ఇప్పటివరకు బ్రేక్ చేయలేదు. టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ 12 బంతుల్లో  50 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. తర్వాత స్థానంలో 17 బంతుల హాఫ్ సెంచరీ చేసి నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్ స్టీఫెన్ మైబర్క్ ఉన్నాడు.


4. టి20 ప్రపంచ కప్ లో ఎక్కువ పరుగులు  చేసిన జట్టు రికార్డును కూడా ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మధ్య 2016 టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు  దిగిన ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించింది. ఇప్పటివరకు ఇంత భారీ స్కోర్ ఎవరు చేదించలేదు అని చెప్పాలి.


5. ఇక వరల్డ్ కప్ లో బ్యాటింగ్లో  అత్యుత్తమ యావరేజ్ కలిగిన ఆటగడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. టి20 ప్రపంచ కప్ లో  21 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 76.82 సగటుతో 845 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: