ఆస్ట్రేలియా వేదికగా గత అయిదు రోజుల నుండి ఎంతో ఉత్కంతనభరితమగా టీ విర్ల్ద్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. అందులో ఇప్పటికే రెండు జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. గ్రూప్ ఏ మరియు బి లుగా బరిలోకి దిగిన ఎనిమిది జట్లలో నమీబియా మరియు యూఏఈ లు తక్కువ ప్రదర్శన చేసిన కారణంగా వెళ్లిపోయాయి. దీనితో శ్రీలంక మరియు నెదర్లాండ్ జట్లు సూపర్ 12 లోకి దూసుకు వెళ్లాయి. కాగా మరో రెండు జట్లకు సూపర్ 12 కు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాగా కాసేపటి క్రితమే ముగిసిన కీలక మ్యాచ్ లో రెండు సార్లు టీ 20 వీజేతగా నిలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది.

ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యి వరల్డ్ కప్ నుండి నిష్క్రమించారు. దీనితో వెస్ట్ ఇండీస్ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మొదట టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ గత మ్యాచ్ లాగానే బ్యాటింగ్ తీసుకుంది. కానీ ఒక్క బ్రాండన్ కింగ్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. చివరి ఓవర్లలో ఒడియన్ స్మిత్ హిట్ చేయడంతో 146 పరుగులు చేసింది. అయితే ఈ స్కోర్ ఐర్లాండ్ ను అడ్డుకోవడానికి సరిపోదు... ఎందుకంటే ఈ జట్టు నిండా హిట్టర్ లు ఉండడం వారికీ బాగా దెబ్బేసింది.

అందుకే ఆరంభం నుండి వెస్ట్ ఇండీస్ బౌలర్లపై ఓపెనర్లు స్టిర్లింగ్ మరియు బల్బీర్నీ లు విరుచుకుపడ్డారు. ఆ ఊపుతో ఐర్లాండ్ కేవలం 17 .3 ఓవర్ లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. స్టిర్లింగ్ 65 పరుగులు చేయగా, టక్కర్ 41 పరుగులు చేసాడు. దీనితో ఐర్లాండ్ జట్టు సూపర్ 12 కు అర్హత సాధించింది. సంచలనాలకు మారుపేరైన ఐర్లాండ్ వెస్ట్ ఇండీస్ ను ఓడించి వరల్డ్ కప్ లో మరో స్టేజ్ లోకి అడుగు పెట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: