ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి ఏకంగా ప్రత్యర్థి జట్లను వణికించింది వెస్టిండీస్. పవర్ఫుల్ హిట్టింగ్ కి మారుపేరుగా కొనసాగుతూ ఎంతో ప్రతిభవంతులైన ఆటగాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది అని చెప్పాలి. ఇక వెస్టిండీస్ జట్టుతో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రత్యర్ధులు సైతం భయపడే విధం గా ప్రదర్శన చేస్తూ ఉండేది. ఇక అలాంటి వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది.


 ఒకప్పుడు ఇక వెస్టిండీస్ జట్టును ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానం లో నిలిపిన ఎంతో మంది క్రికెటర్లు.. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి జట్టుకు దూరం అవడం తో ఇక కొత్తగా వచ్చిన క్రికెటర్లు మాత్రం ఇక నాణ్యమైన క్రికెట్ ఆడలేక పోతున్నారు. తద్వారా ఇక వెస్టిండీస్ క్రికెట్ కి గడ్డు పరిస్థితులు వచ్చాయి. ఎంతలా అంటే  మేటిజట్లకు సైతం సాధ్యం కానీ విధంగా రెండు  సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టు చివరికి వరల్డ్ కప్ లో ఆడాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఇలా క్వాలిఫైయర్ మ్యాచ్లలో అయినా విజయం సాధించి ఇక సూపర్ 12కూ అర్హత సాధిస్తుంది అనుకుంటే.. వెస్టిండీస్ అది కూడా సాధించ లేకపోయింది. ఈ క్రమం లోనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టు టోర్నీకి అర్హత సాధించక పోవడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. వెస్టిండీస్ ఇప్పటివరకు 2012లో, 2016లో రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. 2009,  2014లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. అలాంటి చెట్టు క్వాలిఫైయర్స్ లో క్వాలిఫై అవ్వలేక చివరికి ఇంటి బాట పట్టింది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కుంటుంది. ఇక వెస్టిండీస్ జట్టు అభిమానులైతే తీవ్రస్థాయిలో నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: