ఈనెల 16వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఎన్నో జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్లలో హోరాహోరీగా తలబడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ లో నిలిచి గెలవాలని పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించాయ్
 ఈ క్రమంలోనే పసికూన జట్లు సైతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఇప్పటికే రెండుసార్లు వరల్డ్ కప్ లో టైటిల్ సాధించిన జట్టుగా ఉన్న వెస్టిండీస్ జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్లలో విజయం సాధించలేక ఇంటిదారి పట్టింది.


 ఇక అలాంటిది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో క్వాలిఫై అవ్వని పసికూని జింబాబ్వే జట్టు మాత్రం వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అవటం గమనార్హం. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఒక చిన్న జట్టుగా కొనసాగుతున్న జింబాబ్వే సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి కూడా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతుంది జింబాబ్వే. కానీ క్వాలిఫైయర్ మ్యాచ్ లో వరుసగా ఓటములతో ఎప్పుడు నిరాశ పరుస్తూనే ఉంది. అయితే మొదటిసారి క్వాలిఫైయింగ్ దశ లో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించింది.


 ఇటీవల స్పాట్ ల్యాండ్ తో జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన 15 ఏళ్ల కాలంలో తొలిసారి అటు సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించిన జింబాబ్వే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్వాలిఫైయర్ మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేసి జట్టును సూపర్ 12 కు అర్హత సాధించేలా చేసిన ఆటగాళ్లపై అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.. ఇలా దొరక్క దొరక్క దొరికిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని జింబాబ్వే క్రికెటర్లు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: