క్రికెట్ ప్రపంచం మొత్తం ఊహించినట్లుగానే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఉత్కంఠ భరితంగా లాస్ట్ బంతి వరకు త్రిల్లింగ్ గా జరిగింది మ్యాచ్. చివరికి ఓడిపోతుంది అనుకున్న భారత్ అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించింది అని చెప్పాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆసామాన్యమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా విరాట్ కోహ్లీ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అని చెప్పాలి.


 ఇక విరాట్ కోహ్లీ స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా అతనిలా ఆడలేరేమో అని అనిపించేంతలా సొగసైన షాట్లతో చెలరేగిపోయాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా నవ్వుతూ కనిపించి అందరి మనసులు గెలుచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇలా టీమిండియాను కష్టాల్లో నుంచి గట్టెక్కించి చివరికి విజయాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇకపోతే ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో సాధించిన  82 పరుగుల ద్వారా మరో రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి.


 ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న నెంబర్ వన్ ర్యాంకును తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. టి20 ఫార్మాట్ లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు వరకు రోహిత్ శర్మ టి20 లో 143 మ్యాచ్లలో 3741 పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ 110 ఇన్నింగ్స్ లోనే 3794 పరుగులు చేయడం గమనార్హం. ఈ పరుగుల ద్వారా టీ20 లోనే టాప్ రన్స్ స్కోరగా అవతరించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ రోహిత్ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్తిల్  3,531, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ 3231 ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: