క్రికెట్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు కుదిరితే స్టేడియం కు వెళ్లడానికి లేదంటే టీవీలకు అతుక్కుపోవడానికి ప్రేక్షకులందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో t20 ఫార్మాట్ కు వస్తున్న ఆదరణ గురించి మాటల్లో వర్ణించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకులందరికీ మునుపేన్నడు లేనివిధంగా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది టి20 ఫార్మాట్.


 పసికూన జట్ల దగ్గర నుంచి అటు దిగ్గజ జట్ల వరకు ఎవరికీ ఎవరు తక్కువ కాదు అన్న విధంగానే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే క్రికెట్ మ్యాచ్ జరిగితే ఏదో ఒక జట్టు మరో జట్టుపై అధిపత్యం కొనసాగించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ చాలా తక్కువసార్లు మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతూ ఉంటుంది. ఏకంగా చివరి బంతి వరకు కూడా విజేత ఎవరు అన్నది ప్రేక్షకులకు తెలియని విధంగానే మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఇలాంటి ఉత్కంఠ నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటికే పాకిస్తాన్, భారత్ మ్యాచ్ అంటే చాలు టెన్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తే..  ప్రేక్షకుల గుండె వేగం కూడా పెరిగిపోతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ కప్ లో జరిగిన పాకిస్తాన్,భారత్ మ్యాచ్లో ఇలాగే జరిగింది. చివరి బంతి వరకు కూడా విజేత ఎవరు అన్నది తేలలేదు. చివరికి భారత్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.. అయితే ఇలా చివరి బంతికి భారత్ చాలా తక్కువ సార్లు మాత్రమే విజయం సాధించింది. 2016 లో సీడ్నీలో ఆస్ట్రేలియాపై చివరి బంతికి విజయం సాధించింది. 2018 లో కొలంబోలో బంగ్లాదేశ్ పై చివరి బంతిలోనే విజయ డంక మోగించింది. 2018 లోనే చెన్నైలో వెస్టిండీస్ పై చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. ఇక ఇప్పుడు 2022లో మేల్ బోర్న్ లో పాకిస్తాన్ పై అదే రీతిలో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: