ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యాకు టీమిండియాలో ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు బౌలింగ్లో మంచి ప్రదర్శన చేయడమే కాదు బ్యాటింగ్లో కూడా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా ఆదుకుంటూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. ఇలా ఒక సాదాసీదా ఆటగాడిగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇక తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. అలాంటి హార్దిక్ పాండ్యా ఇక ఐపీఎల్ జరగడానికి ముందు వరకు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.


 గాయం కారణంగా ఇక బౌలింగ్కు దూరమైన హార్థిక్ పాండ్యా బ్యాటింగ్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇక స్టార్ ఆల్ రౌండర్ అయినప్పటికీ అతని జట్టు నుంచి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను గొప్పగా మార్చుకున్న హార్థిక్ పాండ్యా అటు ఐపీఎల్ లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించడమే కాదు ఇక తనలో ఉన్న అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాడు. ఒక ఆటగాడిగా కెప్టెన్ గా కూడా సక్సెస్ అయ్యాడు.

 ఆ తర్వాత టీమిండియాలోకి ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రదర్శనతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కూడా కఠిన పరిస్థితుల మధ్య జట్టును హాఫ్ సెంచరీ చేసి ఆదుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇకపోతే హార్దిక్ పాండ్యా ప్రతిభ పై పాకిస్తాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. కఠిన పరిస్థితులను ఎదుర్కొని హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానం స్ఫూర్తిదాయకం అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక అతను ఐపీఎల్ జట్టును కెప్టెన్ గా ట్రోఫీ గెలిపించాడు.  ఇప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా కెప్టెన్ కు సలహా ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. ఇక తదుపరి కెప్టెన్ అతనే అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ హార్దిక్ పాండ్యా పై ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: