ప్రస్తుతం క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ఆస్ట్రేలియా వేదికగా తిష్ట వేసాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే వరల్డ్ కప్ లో హోరాహోరీగా తలబడుతూ విశ్వవిజేతగా నిలబడడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని జట్లు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. ఇక క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం వరల్డ్ కప్ మీదే ఉంది. ఇలాంటి సమయంలోనే అటు బీసీసీఐ కూడా వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం కసరత్తులు చేస్తూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమం లోనే డిసెంబర్లో వేలం నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అంతకుముందు గానే ఇక ఆయా ఫ్రాంచైజీలు వదులుకోబోతున్న ఆటగాళ్ల వివరాలను తెలపాలి అంటూ బీసీసీఐ ఇక జట్టు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 15 నాటికి కూడా రిలీజ్ చేసే ప్లేయర్ వివరాలను బీసీసీఐకి అందించనున్నాయి అని జట్ల యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ  తమ జట్టు ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టి20 స్పెషలిస్ట్ బౌలర్ శార్దూల్ ఠాగూర్, తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్, మన్దీప్ సింగ్ లను ఇక వదులుకోవడానికి సిద్ధమైందట.


 ఇక తమ జట్టు నుంచి వదులుకో బోతున్న ఆటగాళ్ల వివరాలలో ఈ ముగ్గురి పేర్లను చేర్చి అటు బీసీసీఐకి అందజేయ బోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు బ్యాక్అప్ వికెట్ కీపర్ గా ఉంటూ వచ్చాడు కేఎస్ భరత్. ఇక అతనికి తుది జట్టులో  అవకాశం దక్కలేదు. కానీ పృథ్వి షా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జట్టులోకి వచ్చాడు. కానీ తన బ్యాటింగ్ తో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో ఈ తెలుగు క్రికెటర్ ని పక్కకు పెట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భావిస్తుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl